భారతదేశం, మార్చి 19 -- Whatsapp Governance: చంద్రబాబునాయుడు సింగపూర్ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రేరణ పొంది ఈ-సేవ సర్వీసులను ఎలక్ట్రిసిటీ బిల్ తో ప్రారంభించారని వాటిని క్రమంగా అనేకరకాల సేవలకు విస్తరించారని తర్వాత మీ సేవగా మారిందని నారా లోకేష్‌ అసెంబ్లీలో వివరించారు. వాట్సాప్‌ మనమిత్ర సేవల్ని 500 సేవలకు అందించనున్నట్టు ప్రకటించారు.

యువగళం పాదయాత్రలో తెలుసుకున్నానని గ్రామ గ్రామాన ప్రజలను కలిసినపుడు ఆఫీసుల ముందు పడిగాపులు పడాల్సి వస్తోందని తనకు చెప్పారని బటన్ నొక్కితే సినిమా టిక్కెట్లు, స్విగ్గీ ఫుడ్, నిత్యావసర వస్తువులు, ట్యాక్సీ వంటి అన్ని సేవలు ఇంటికి వస్తున్నపుడు ప్రభుత్వ సేవలు ఎందుకు రావడం లేదని ప్రజలు నన్ను ప్రశ్నించడంతో వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఆలోచన వచ్చినట్టు చెప్పారు.

ఆఫీసులకు వెళితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, గంటల తరబడి నిలబడ...