భారతదేశం, ఫిబ్రవరి 4 -- వినియోగదారుల ఎక్స్​పీరియెన్స్​ని మెరుగుపరిచేందుకు వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ని తీసుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే 2025 జనవరిలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లో వాట్సాప్​ వినియోగదారుల కోసం ఏకంగా 6 కొత్త ఫీచర్స్​ని ప్రవేశపెట్టింది. ఈ అప్డేట్లలో కొన్ని గతంలో బీటాలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చాయి. తాజా ఫీచర్లను యాక్సెస్ చేసుకోవడానికి, మీరు మీ వాట్సాప్​ని లేటెస్ట్​ వెర్షన్​కి అప్​డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక వాట్సాప్​ కొత్త ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వాట్సాప్​ ఏఐ స్టూడియో ఫీచర్​ని లాంచ్ చేసింది. ఇది వినియోగదారులను వివిధ ఏఐ పర్సనాలిటీలతో నిమగ్నం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఇంటరాక్షన్​కి ఫన్​ని యాడ్​ చేస్తాయి. ఫేమస్​ పర్సనాలిటీస్​ నుంచి వివిధ వ్యక్తుల రోల్స్​ని ఈ పర...