భారతదేశం, ఏప్రిల్ 12 -- ఇండియన్​ స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్​మెంట్​ అంటే చాలా మందికి మొదట గుర్తొచ్చే ఆప్షన్​ మ్యూచువల్​ ఫండ్స్​. వీటిల్లో సిప్​ చేస్తే భవిష్యత్తులో మంచి రాబడులు ఉంటాయని మదుపర్లు భావిస్తుంటారు. అయితే, మ్యూచువల్​ ఫండ్స్​ తరహాలోనే మరో ఆప్షన్​ ఉందని మీకు తెలుసా? అదే ఈటీఎఫ్​! ఈటీఎఫ్​ అంటే ఎక్స్​ఛేంజ్​ ట్రేడెడ్​ ఫండ్​. అసలేంటిది? ఎలా పనిచేస్తుంది? ఎన్ని రకాల ఈటీఎఫ్​లు ఉన్నాయి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎక్స్​ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) అనేది ఈక్విటీల ట్రేడింగ్ సౌలభ్యంతో మ్యూచువల్ ఫండ్స్ తరహా వైవిధ్య ప్రయోజనాలను అందించే సెక్యూరిటీల కలయిక. ఇది ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ మాదిరిగా పనిచేస్తుంది. ఒకే ఒక ముఖ్య వ్యత్యాసం ఏంటంటే.. ఈటీఎఫ్​లను వ్యక్తిగత స్టాక్స్ మాదిరిగానే స్టాక్ ఎక్స్​ఛేంజీల్లో కొనుగోలు చేయవచ్చు, విక్రయించ...