భారతదేశం, మార్చి 6 -- దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ వోక్స్​వ్యాగన్​ ఓ చిన్న ఎస్​యూవీని రెడీ చేసింది. దీని పేరు వోక్స్​వ్యాగన్​ టెరా. ఈ ఎస్​యూవీని బ్రెజిల్​ మార్కెట్​లో ఇటీవలే ఆవిష్కరించింది. ఇది.. వోక్స్​వ్యాగన్ విక్రయించే అత్యంత సరసమైన, చిన్న వాహనం. ఈ ఎస్​యూవీ ఎక్స్​టీరియర్, ఇంటీరియర్​ని మాత్రమే బ్రాండ్ ప్రదర్శించింది. టెక్నికల్ స్పెసిఫికేషన్​లు ప్రస్తుతానికి గోప్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వోక్స్​వ్యాగన్ రియో డి జనీరో కార్నివాల్​లో ఈ టెరా ఎస్​యూవీని సంస్థ ప్రదర్శించింది. దీనిని లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో విక్రయించడానికి బ్రెజిల్​లో ఉత్పత్తి చేయనుంది.

టెరాతో వచ్చే కొన్ని ఫీచర్లను వోక్స్​వ్యాగన్ ధృవీకరించింది. ఇందులో ఎల్ఈడీ హెడ్​ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్​తో పాటు డేటైమ్​ రన్నింగ్ ల్యాంప్...