భారతదేశం, మార్చి 21 -- దిగ్గజ వివో సంస్థ ఇటీవలే మరో స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది. దీని పేరు వివో వీ50 లైట్​ 4జీ. గతేడాది వచ్చిన వివో వీ40 లైట్​ 4జీకి ఇది సక్సెసర్​గా మార్కెట్​లోకి అడుగుపెట్టింది. డిస్​ప్లే, బ్యాటరీ, కెమెరా టెక్నాలజీలో అనేక అప్​గ్రేడ్స్​ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో వీ50 లైట్ 4జీలో 6.77 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్​ప్లే, ఎఫ్​హెచ్​డీ+ రిజల్యూషన్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ వరకు పీక్​ బ్రైట్​నెస్​, 387 పీపీఐ పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. డిస్​ప్లే డీసీఐ పీ3 కలర్ గేమింగ్​ని కూడా సపోర్ట్ చేస్తుంది. మెరుగైన వ్యూయింజ్​ ఎక్స్​పీరియెన్స్​ కోసం ఎస్​జీఎస్-సర్టిఫైడ్ ఐ కంఫర్ట్, లో బ్లూ లైట్ టెక్నాలజీని కలిగి ఉంది.

7.79 ఎంఎం స్లిమ్ ప్రొఫైల్, 196 గ్రాముల బరువుతో, ఎంఐఎల్-ఎస్​టీడీ...