భారతదేశం, ఫిబ్రవరి 17 -- దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వివో నుంచి సరికొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​ ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ వివో టీ4ఎక్స్​ స్మార్ట్​ఫోన్​ ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో లాంచ్​ చేయనుంది సంస్థ. దీనికి సంబంధించిన టీజర్స్​ని వదులుతోంది. అంతేకాదు, లాంచ్​ని ధ్రువీకరిస్తూ.. ఈ కామర్స్​ ప్లాట్​ఫామ్​ ఫ్లిప్​కార్ట్​లో సేల్స్​కి సంబంధించిన వివరాలను కూడా పంచుకుంది. ఈ నేపథ్యంలో ఈ వివో టీ4ఎక్స్​ 5జీ స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో తన రాబోయే టీ4ఎక్స్​ 5జీ స్మార్ట్​ఫోన్​ని మార్చ్​లో లాంచ్ చేయనుంది. అయితే అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. రూ.15,000 లోపు ధర కలిగిన ఈ స్మార్ట్​ఫోన్.. సెగ్మెంట్​లోనే భారీ బ్యాటరీ ప్యాక్​తో వస్తోంది. గత సంవత్సరం, వివో టీ3ఎక్స్ 5జీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కా...