భారతదేశం, ఏప్రిల్ 14 -- దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఒక షాకింగ్​ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. కొన్ని రోజుల క్రితం దిల్లీలో సంభవించిన ధూళి తుపానుకు ఒక గోడ కూలిపోయింది. ఆ శిథిలాలు కింద నడుస్తున్న వ్యక్తిపై పడటంతో అతను స్పాట్​లో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు అంతా ప్రశాంతంగా ఉన్న అక్కడి పరిస్థితుల్లో, మరుక్షణమే మృత్యువు వెంటాడింది!

దిల్లీలోని మధు విహార్​లో శుక్రవారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియోని పీటీఐ వార్తా సంస్థ షేర్ చేసింది. ఈ వీడియోలో మధు విహార్​లోని ఒక ఇరుకైన సందులో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించింది. ఉన్నట్టుండి పై నుంచి ఒక గోడ కూలి, రోడ్డు మీద పడింది. అక్కడే ఉన్న ఆ వ్యక్తిపైనా శిథిలాలు పడటంతో అతను నేల మీద పడిపోయాడు. ఆ తర్వాత కదల్లేదు, లేవలేదు. అలా ఉండిపోయాడు.

చుట...