భారతదేశం, సెప్టెంబర్ 28 -- ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కరూర్ ర్యాలీకి ఏడు గంటలు ఆలస్యంగా రావడం వల్లే నియంత్రించలేని విధంగా అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడానికి దారితీసిందని తమిళనాడు డీజీపీ జీ వెంకటరమణ తెలిపారు. అనంతరం తొక్కిసలాట జరిగిందని వివరించారు.

విజయ్​ సభలో తొక్కిసలాట ఘటనలో 39 మంది మరణించగా, 50మందికిపైగా మంది గాయపడ్డారు.

తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తరపున శనివారం కరూర్‌లో నిర్వహించిన ఈ రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట సంఘటనపై డీజీపీ జీ వెంకటరమణ అర్ధరాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ర్యాలీ నిర్వాహకులు కేవలం 10,000 మంది వస్తారని అంచనా వేశారని, కానీ సుమారు 27,000 మంది హాజరయ్యారని డీజీపీ తెలిపారు.

ఈ ర్యాలీ కోసం 500 మంది సిబ్బందిని మోహరించినట్లు ఆయన చెప్పారు.

"టీవీకే గత ర్యాలీలకు తక్కువ సంఖ్యలో అభిమానులు...