Hyderabad, మార్చి 21 -- Vijay Deverakonda Betting: బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారంటూ విజయ్ దేవరకొండపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై అతని టీమ్ స్పందించింది. చట్టపరంగా అనుమతించిన ఆన్లైన్ నైపుణ్య ఆధారిత గేమ్స్ ను మాత్రమే అతను ప్రమోట్ చేశాడని, చట్టవిరుద్ధ బెట్టింగ్ కాదని వారు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికే రానా దగ్గుబాటి,ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు కూడా దీనిపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పరిమిత కాలం పాటు వ్యవహరించారని, లీగల్ గేమ్స్ కు మాత్రమే సపోర్ట్ చేశారని విజయ్ దేవరకొండ టీమ్ స్పష్టం చేసింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనే ఉద్దేశంతోనే విజయ్ దేవరకొండ అధికారికంగా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని అతని టీమ్ తెలిపింది.ఆన్లైన్ నైపుణ్య ఆధారిత గేమ్స్ ...