భారతదేశం, ఫిబ్రవరి 9 -- టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్లాఫ్‍లను ఎదుర్కొన్నారు. గతేడాది ది ఫ్యామిలీ స్టార్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు విజయ్. ఈ మూవీని ప్రాజెక్ట్ పేరు వీడీ12తో ప్రస్తుతం పిలుస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఫిబ్రవరి 12న టైటిల్ టీజర్ రానుంది. ఈ తరుణంలో ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు విజయ్ దేవరకొండ వెళ్లారు. నదీ జలాల్లో పుణ్య స్నానం ఆచరించారు. ఆ వివరాలు ఇవే..

తన తల్లి మాధవితో కలిసి ప్రయాగ్‍రాజ్‍కు మహా కుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్లారు విజయ్ దేవరకొండ. అక్కడ ఎవరూ గుర్తించకుండా ముందుగా మాస్క్ ధరించారు. ఆ తర్వాత గంగ, యమున, సరస్వతి నదుల సగమం వద్ద పుణ్య స్నానం చేశారు. విజయ్, ఆయన తల్లి నదీ జలాల్లో పుణ్య స్నానం ఆచరించారు.

మెడలో రుద్రాక్ష మాలలు వేసుకున్నారు విజయ్ దేవ...