భారతదేశం, ఆగస్టు 22 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలు, వలస విధానాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది! ఇందులో భాగంగా అమెరికా వీసాలు కలిగి ఉన్న 5.5 కోట్ల మంది విదేశీయులందరూ 'నిరంతర సమీక్ష'కు లోబడి ఉంటారని అక్కడి స్టేట్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. వీరి వీసాలు ఏ క్షణంలోనైనా రద్దు అయ్యే ప్రమాదం లేకపోలేదు!

"ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే అమెరికా వీసాలు కలిగి ఉన్న 5.5 కోట్ల మంది విదేశీయులందరినీ నిరంతరం పరిశీలిస్తున్నాం," అని స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు. "అమెరికాలో గడువుకు మించి ఉన్నా, క్రిమినల్ కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం వంటివి చేస్తే.. ఆ వీసాలను రద్దు చేస్తాం," అని స్పష్టం చేశారు.

అయితే 5.5 కోట్ల వీసాలన్నీ ప్రస్తుతం సమీక్ష...