భారతదేశం, ఏప్రిల్ 5 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించిన టారీఫ్​లతో అగ్రరాజ్యంలోని స్టాక్​ మార్కెట్​లు విలవిలలాడుతున్నాయి. రెండు ట్రేడింగ్​ సెషన్స్​లో దారుణ పతనాన్ని నమోదు చేశాయి. కొవిడ్​ అనంతరం తొలిసారి వాల్​ స్ట్రీట్​లో అత్యంత తీవ్రమైన సంక్షోభం కనిపిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎస్ అండ్ పీ 500 5.9 శాతం పడింది. గురువారం కనిపించిన పతనాన్ని కూడా కలుపుకుంటే.. ఈ ఒక్క సూచి 5 ట్రిలియన్​ డాలర్లు కోల్పోయింది. ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2,231 పాయింట్లు పతనమైంది. మరోవైపు టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ కాంపోజిట్ 5.8% క్షీణించింది. సాధారణంగా ప్రతి నెలా ఆర్థిక హైలైట్​గా ఉండే అమెరికా జాబ్ మార్కెట్​పై ఆశించిన దానికంటే మెరుగైన నివేదిక రావడం కూడా పతనాన్ని ఆపడానికి సరిపోలేదు.

అమెరికా టారిఫ్​లకు చైనా ప్రతిస్పందన ప్రపంచవ్యాప్తంగా మ...