భారతదేశం, ఏప్రిల్ 6 -- అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వానికి వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. మొత్తం 50 రాష్ట్రాల్లోని అనేక ప్రధాన నగరాల్లో ప్రజలు భారీ సంఖ్యలో ఉద్యమించారు. 'హ్యాండ్స్​ ఆఫ్​' పేరుతో ర్యాలీలు నిర్వహించి, ట్రంప్​నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్​ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతిపక్షానికి ఇది అతిపెద్ద నిరసన ప్రదర్శనగా మారింది.

టారీఫ్​ పేరుతో ప్రపంచ దేశాలను ట్రంప్​ భయపెడుతున్న విషయం తెలిసిందే. అయితే, ట్రంప్​ చర్యల వల్ల అమెరికాకి కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. ఇందుకు నిరసనగా పౌరహక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ఎల్​జీబీటీక్యూ మద్దతుదారులు, అనుభవజ్ఞులు, ఎన్నికల సంస్కరణ కార్యకర్తలు సహా 150కి పైగా సంస్థల మద్దతుతో మొత్తం 50 రాష్ట్ర...