భారతదేశం, మార్చి 25 -- అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలపై పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో హెచ్-1బీ ఉద్యోగులు, ఇతర దేశాల విద్యార్థులు (ఎఫ్-1), గ్రీన్ కార్డు హోల్డర్లు న్యాయనిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. అమెరికా నుంచి విదేశాలకు వెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, భూటాన్ సహా 43 దేశాల ప్రజల ప్రయాణాలను పరిమితం చేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడటం గమనార్హం. భారతదేశం ఎటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రయాణ నిషేధ జాబితాలలో లేనప్పటికీ, మరింత కఠినమైన భద్రతా తనిఖీలు, వీసా స్టాంపింగ్​లో బ్యాక్​లాగ్​, యూఎస్ విమానాశ్రయాల్లో నిర్బంధానికి కూడా గురయ్యే అవకాశం ఉన్న తరుణంలో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

భారతీయ హెచ్ -1బీ, ఎఫ్ -1 వీసా, గ్రీన్ కార్డు హోల్డర్లు అమెరికా నుం...