భారతదేశం, జనవరి 27 -- US Citizenship: అమెరికాలో జన్మించే వారికి పుట్టుకతో లభించే పౌరసత్వ హక్కును రద్దు చేయాలన్న అమెరికా అధ్యక్షుడి తాజా నిర్ణయ ప్రవాస భారతీయుల్లో కలకలం రేపుతోంది. జనవరి 20న అమెరికా అధ‌్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో బర్త్‌ రైట్ సిటిజన్‌ షిప్‌ కోసం అమెరికా రాజ్యాంగంలో చేసిన 14వ సవరణ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు.

దీనిపై ఇప్పటికే న్యాయ స్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. మరోవైపు సరైన పత్రాలు, తిరుగు ప్రయాణం టిక్కెట్లు లేకుండా అమెరికాలో అడుగు పెడుతున్న వారిని బలవంతంగా వారి స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. అక్రమ వలసల్ని నిరోధించే క్రమంలో అమెరికా నూతన అధ్యక్షుడు ఆంక్షలు విధించడం ఇప్పటికే మొదలైంది. మరోవైపు ట్రంప్ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలోగా పిల్లల్ని కనేయాలనే ...