భారతదేశం, ఏప్రిల్ 12 -- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవల్లో తరచూ కనిపిస్తున్న అంతరాయాలు కస్టమర్స్​ని ఇబ్బందిపెడుతున్నాయి. తాజాగా యూపీఐ సేవలు శనివారం మళ్లీ డౌన్​ అయ్యాయి. ఫలితంగా దేశంలోని వేలాది మందికి పేటీఎం, ఫోన్​పే, గూగుల్​పే వంటి ప్రముఖ యాప్స్​లో లావాదేవీలు నిలిచిపోయాయి.

అంతరాయాలను ట్రాక్​ చేసే ప్లాట్​ఫామ్​ డౌన్​ట్రాకర్​ ప్రకారం.. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు యూపీఐ పేమెంట్స్ డౌన్​ అయ్యాయి.​

గత నెలలో కూడా యూపీఐ సేవలు నిలిచిపోయి, ప్రజలను ఇబ్బంది పెట్టాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....