భారతదేశం, మార్చి 20 -- UPI apps update: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ లను ప్రభావితం చేసే కొత్త నిబంధనలను 2025 ఏప్రిల్ 1 నుంచి తీసుకురానుంది. యూపీఐతో లింక్ అయిన మొబైల్ నంబర్లు ఎక్కువ కాలం యాక్టివ్ గా లేకపోతే వాటిని బ్యాంకు ఖాతాల నుంచి తొలగిస్తామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. అంటే, ఒకవేళ, మీ బ్యాంక్ అకౌంట్ కు ఇన్ యాక్టివ్ గా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే, ఆ బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానమై ఉన్న యూపీఐ యాప్స్ పని చేయవు.

రోజురోజుకూ సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండటంతో ఎన్ పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ యాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థల్లో సాంకేతిక లోపాలను సృష్టిస్తున్నాయని పేర్కొంది. టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయిస్తే, ఇది మోసానికి వీలు కల్పిస్తుంది. అందువల్ల, యుపిఐ...