భారతదేశం, మార్చి 10 -- ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ 13ఏళ్ల బాలుడిపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అతడిని చంపేశారు. పవిత్ర రంజాన్​ వేళ తమ తమ పార్ట్​నర్లు శృంగారానికి ఒప్పుకోకపోవడంతో ఆ ఇద్దరు పురుషులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లో ఈ నెల మొదట్లో జరిగింది ఈ ఘటన. బాధితుడు స్థానిక జిమ్​కు వెళ్తుండగా నిందితులు అతనిపై దాడి చేశారు. అజహర్, హుస్సేనీలు అతడిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి తాడుతో కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు.

కాగా ఈ విషయాన్ని హెచ్​టీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

అనంతరం నిందితులు.. తాడుతో బాధితుడి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశారు.

పోలీసులు హుస్సేనీని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

మతపరమైన కట్టుబాట్ల కారణంగా తమ భాగస్వాములు తమతో శృంగారం చేయ...