Hyderabad, మార్చి 28 -- UI TV Premiere Date: కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన మూవీ యూఐ (UI). గతేడాది డిసెంబర్ 20న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకూ ఓటీటీలోకి రాలేదు. అయితే అప్పుడే టీవీ ప్రీమియర్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీ జీ కన్నడ ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. అయితే ఓటీటీ రిలీజ్ పై మాత్రం ఎలాంటి ప్రకటనా లేదు.

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించి, డైరెక్ట్ చేసిన మూవీ యూఐ. ఈ సినిమా ఉగాది సందర్భంగా జీ కన్నడ ఛానెల్లో ప్రీమియర్ కాబోతోంది. ఈ ఆదివారం (మార్చి 30) సాయంత్రం 4.30 గంటలకు మూవీ టెలికాస్ట్ కానున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. దీంతో అప్పటి నుంచే ఓటీటీలోకి కూడా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో జీ నెట్‌వర్క్ తాను హక్కులు పొందిన సినిమాలను ఒకేసారి ఇటు టీవీ, అటు ఓటీటీలోకి తీసుకొస్తోంది. కిచ్చా సుదీప్ మ్యాక్స్, తెలుగుల...