భారతదేశం, జనవరి 27 -- ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం సోమవారం రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేయనుంది. ఉత్తరాఖండ్​లో 2022 మార్చ్​లో తిరిగి ఎన్నికల్లో గెలిచిన ధామి ప్రభుత్వం.. అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా గత కొన్నేళ్లు ఈ యూసీసీపై విపరీతమైన చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా యూసీసీని అమలు చేయడం బీజేపీ అజెండాలో ఉంది. కాగా, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్​ నిలిచిపోనుంది.

షెడ్యూల్డ్ తెగల సభ్యులు మినహా రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికీ, రాజ్యాంగంలోని 22వ భాగం (లేదా 21) కింద ఉన్న వారందరికీ ఈ యూససీ వర్తిస్తుంది. బయట నివసిస్తున్న ఉత్తరాఖండ్ వాసులు కూడా ఉమ్మడి పౌరస్మృతి పరిధిలోకి వస్తారు!

1. ప...