భారతదేశం, ఫిబ్రవరి 1 -- మెగా అభిమానులకు ఇది అసలైన పండుగ వార్త. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుటుంబంలోకి కొత్త అతిథులు అడుగుపెట్టారు. శనివారం (జనవరి 31) ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో ఆనందం అంబరాన్నంటింది.
ఈ అద్భుతమైన గుడ్ న్యూస్‌ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధృవీకరించారు. "ఎంతో ఆనందంతో, కృతజ్ఞతా భావంతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాము. చరణ్, ఉపాసనలకు కవలలు (బాబు, పాప) జన్మించారు" అని చిరంజీవి పేర్కొన్నారు.
"తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నారు. తాతామ్మలుగా ఈ చిన్నారులను మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు దైవప్రసాదంగా భావిస్తున్నాము. మీ అందరి ప్రార్థనలు, ప్రేమకు ధన్యవాదాలు" అని చిరంజీవి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో చిరంజీవి పోస్ట్ ఇంటర్నెట్‌లో తెగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.