భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల దిగుమతులపై 100 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు కుప్పకూలాయి! అమెరికాలో తయారీ ప్లాంట్‌ను నిర్మించని కంపెనీల బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఔషధాలపై అక్టోబర్ 1 నుంచి ఈ సుంకం అమలవుతుంది. ఈ ప్రకటన ప్రభావంతో సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, లుపిన్, నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్ వంటి ప్రముఖ ఫార్మా స్టాక్‌లు 3 శాతానికి పైగా పడిపోయాయి.

ట్రంప్ నిర్ణయంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ తొలుత దాదాపు 3శాతం పతనమై, ఉదయం 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో 2.35% నష్టాల్లో కొనసాగుతోంది. నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, గ్లాండ్ ఫార్మా, ఐపీసీఏ లేబొరేటరీస్, బయోకాన్ షేర్లు ఒక్కొక్కటి సుమారు 3%...