భారతదేశం, ఏప్రిల్ 23 -- Trains Cancelled: రైల్వే నిర్వహణ పనుల్లో భాగంగా విజయవాడ Vijayawada రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను పూర్తిగాను, మరికొన్ని రైళ్లను పాక్షికంగాను రద్దు చేశారు. ప్యాసింజర్ రైళ్ల రద్దుతో ప్రయాణికులు ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 22 నుంచి మే 22 మధ్య కాలంలో దాదాపు 14రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. రద్దైన రైళ్లలో ట్రైన్‌ నంబర్ 07977 బిట్రగుంట విజయవాడ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07978 విజయవాడ-బిట్రగుంట ప్యాసింజర్ రైలును ఏప్రిల్ 22 నుంచి 28వరకు రద్దు చేశారు.

ట్రైన్‌ నంబర్ 17237 బిట్రగుంట-చైన్నై సెంట్రల్, ట్రైన్‌ నంబర్ 17238 చెన్నై సెంట్రల్-బిట్రగుంట రైలును ఏప్రిల్ 22- 26 తేదీల మధ్య రద్దు చేశారు.

ట్రైన్‌ నంబర్ 07279 విజయవాడ-తెనాలి, ట్రైన్‌ నంబర్‌ 07575 తెనాలి-విజయవాడ రైలును ఏప్రిల్‌ 22-28 మధ్య రద్దు చే...