భారతదేశం, అక్టోబర్ 8 -- అనుకోకుండా ప్రయాణ ప్రణాళికలు మారినప్పుడు ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు! ముఖ్యంగా డబ్బు పోగొట్టుకోకుండా ప్రణాళికలను సర్దుబాటు చేసుకునేందుకు భారతీయ రైల్వేస్ ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి నెల నుంచి ప్రయాణికులు తమ కన్ఫర్మ్ అయిన రైలు టికెట్ల ప్రయాణ తేదీని ఆన్‌లైన్‌లో, ఎటువంటి రుసుము లేకుండా, మార్చుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. ప్రయాణ తేదీని మార్చుకోవాలంటే, ప్రయాణికులు ముందుగా తమ ట్రైన్​ టికెట్‌ను రద్దు (Cancel) చేసుకొని, మళ్లీ కొత్త టికెట్‌ను బుక్ చేసుకోవాలి. దీనివల్ల రద్దు చేసుకునే సమయాన్ని బట్టి కొంత మొత్తం డబ్బు కట్ అవుతుంది. ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నదిగా, తరచుగా అస...