భారతదేశం, మార్చి 30 -- ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది! కట్​ జిల్లా మంగులి సమీపంలోని నిర్గుండి వద్ద ఎస్​ఎంవీటీ బెంగళూరు- కామ్యాఖ్య ఏసీ ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పాయి. మొత్తం 11 బోగీలు ప్రమాదానికి గురయ్యాయి.

ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) అశోక్ కుమార్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 11.54 గంటలకు ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం రిపోర్ట్​ అవ్వలేదు.

ఒడిశా రైలు ప్రమాదం విషయం తెలుసుకున్న ఈసీఓఆర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఖుర్దా రోడ్, ఈసీఓఆర్ జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టారు.

రిలీఫ్​ ట్రైన్​ని కూడా సంఘటనా స్థలానికి తరలించారు.

"మా వనరులను సమీకరించి ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాం. ఘటనాస్థలికి సహాయక రై...