భారతదేశం, అక్టోబర్ 8 -- బిహార్​లోని దిల్లీ- కోల్​కతా హైవేపై భారీ ట్రాఫిక్​ జామ్​ నెలకొంది! అనేక వాహనాలు 4 రోజులుగా ట్రాఫిక్​ జామ్​లో చిక్కుకుపోయాయి. గత 24 గంటల్లో వాహనాలు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ముందుకు కదిలినట్టు సమాచారం. అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ట్రాఫిక్​ జామ్​లో పడిగాపులుకాస్తున్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!

అదొక అంతం లేని పొడవైన క్యూ లైన్. వందల కొద్దీ వాహనాలు ఒకదాని వెనుక ఒకటి అతి దగ్గరగా బంపర్-టు-బంపర్ ట్రాఫిక్​ మధ్య నిలిచిపోయాయి. గత నాలుగు రోజులుగా బిహార్‌లోని దిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారిపై చిక్కుకుపోయిన వాహనాలతో ఆ రూట్​ మొత్తానికే మూసుకుపోయింది! ఎప్పుడు ఉపశమనం లభిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

గత శుక్రవారం బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా, రహదారి నిర్మాణ సంస్థ ఏర్పాటు ...