భారతదేశం, ఏప్రిల్ 1 -- ట్రాఫిక్ జరిమానాల రికవరీని పెంచడానికి కొన్ని కఠినమైన చర్యలను అమలు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది! నిబంధనలు పాటించని డ్రైవర్లకు జరిమానా విధించేందుకు ప్రభుత్వం పలు చర్యలను ప్రతిపాదించింది. కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం ట్రాఫిక్ ఈ-చలాన్లు చెల్లించని వారికి డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం.. వాహన యజమానులు ట్రాఫిక్ ఈ-చలాన్లను మూడు నెలల్లోగా చెల్లించాలి. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్​ను సస్పెండ్ చేస్తారు. రెడ్ సిగ్నల్ జంప్ చేయడం లేదా ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినందుకు మూడు చలాన్లు (ఒక ఆర్థిక సంవత్సరంలో) పడిన వారి డ్రైవింగ్ లైసెన్స్​ని కనీసం మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

వీటితో పాటు వాహన బీమా ప్రీమియంలను ట్రాఫిక్ ఈ-చలాన్లతో అనుసంధానం చేయాలని ముసాయిదా నిబంధ...