భారతదేశం, ఫిబ్రవరి 19 -- టయోటా ల్యాండ్ క్రూజర్ 300 భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఎస్​యూవీ జెడ్ఎక్స్, జీఆర్-ఎస్ అనే రెండు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధర వరుసగా రూ.2.31 కోట్లు, రూ.2.41 కోట్లుగా నిర్ణయించారు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ల్యాండ్ క్రూజర్ 300 కోసం బుకింగ్​లు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. ఇది సీబీయూ (కంప్లీట్లీ-బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశానికి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టయోటా ల్యాండ్ క్రూజర్ 300 ఎస్​యూవీలో వీ6 డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4,000 ఆర్​పీఎమ్ వద్ద 304 బీహెచ్​పీ పీక్​ పవర్​ని, 1,600-2,600 ఆర్​పీఎమ్ వద్ద 700 ఎన్ఎమ్ పీక్​ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. గేర్ బాక్స్ అనేది 10-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్. ఇదొక ఆల్-వీల్ డ్రైవ్ ఎస్​యూవీ. మల్టీ-టెర్రైన్ సెలెక్ట్ (ఎంటీఎస్), మల్టీ-ట...