భారతదేశం, మార్చి 16 -- అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో టోర్నడోలు అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. భయానకంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టోర్నోడో ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఇప్పటివరకు 32మంది మరణించారు.

టోర్నడోల కారణంగా అమెరికావ్యాప్తంగా మొత్తం మీద 20 రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. మిస్సోరి, అర్కాన్సాస్, టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మిస్సోరీలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఈ ఒక్క రాష్ట్రంలో 12 మంది మరణించారు! కాన్సాస్​లో శుక్రవారం హైవేపై 50కి పైగా వాహనాలు ఢీకొనడంతో ఎనిమిది మంది మృతి చెందారు.

టోర్నడోల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయాయి.

"అది ఇల్లుగా కనిపించడం లేదు. కేవలం శిథిలాలు మాత్రమే ఉన్నాయి. నేల తలకిందులైంది. మేము గోడలపై నడుస్తున్నాము," అని బట్లర్ కౌంటీకి చెందిన కరోనర్ జిమ్ ...