Hyderabad, ఫిబ్రవరి 14 -- Top Telugu Serial: తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో చాలా వరకు ప్రతి వారం పెద్దగా మార్పులు ఉండవు. టాప్ 3లో కొంత కాలం వరకు కొన్ని సీరియల్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి. అయితే తాజాగా స్టార్ మా ఛానెల్లో వచ్చే గుండె నిండా గుడి గంటలు మాత్రం అనూహ్యంగా టాప్ లోకి దూసుకెళ్లింది. అర్బన్ ఏరియా టీఆర్పీ రేటింగ్స్ లో ఇప్పుడీ సీరియల్ కు తిరుగులేకపోవడం విశేషం.

తెలుగు టీవీ సీరియల్స్ లో గతేడాది చాలా వరకు బ్రహ్మముడి హవా కొనసాగింది. అయితే ఆ సీరియల్ ప్రైమ్ టైమ్ నుంచి మధ్యాహ్నానికి మారడంతో క్రమంగా కనుమరుగైంది. ఆ తర్వాత కార్తీకదీపం 2 సీరియల్ టాప్ లో ఉంటూ వస్తోంది. అటు అర్బన్, ఇటు రూరల్ ఏరియాల్లో కార్తీకదీపం సీరియల్ కు తిరుగులేదు అనేలా సాగింది.

కానీ తాజాగా ఐదో వారానికి సంబంధించి రిలీజైన రేటింగ్స్ లో గుండె నిండా గుడి గంటలు స...