భారతదేశం, సెప్టెంబర్ 5 -- శుక్రవారం, సెప్టెంబర్ 5న దేశంలోని పలు నగరాల్లోని బ్యాంకులకు సెలవు ఉంది! మిలాద్ ఉన్ నబీ/ ఈద్ ఏ మిలాద్, తిరువోణం పండుగల సందర్భంగా ఈ సెలవు వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం ఈ విషయం వెల్లడైంది.

అయితే, ముంబైలో మాత్రం సెప్టెంబర్ 5న ఉన్న సెలవును సెప్టెంబర్ 8కి మార్చారు. ముస్లింల ఊరేగింపు సెప్టెంబర్ 8న ఉండడంతో, ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తులు అందాయి. దీనితో ఆర్బీఐ సెప్టెంబర్ 3న ఒక ప్రకటన విడుదల చేసి.. ముంబైలో సెప్టెంబర్ 5న ఉన్న బ్యాంకు సెలవును సెప్టెంబర్ 8కి మార్చినట్టు తెలిపింది.

ఆర్బీఐ ప్రతియేటా విడుదల చేసే సెలవుల క్యాలెండర్‌లో బ్యాంకులకు సెలవు దినాలను ప్రకటిస్తుంది. చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీని నియంత్రించే నిగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ...