భారతదేశం, ఏప్రిల్ 12 -- సోహమ్ షా ప్రధాన పాత్ర పోషించిన క్రేజీ (Crazxy) సినిమా ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తుంబాడ్ చిత్రాన్ని నిర్మించిన సోహం షా ఫిల్మ్స్ పతాకం నుంచి రావటంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. క్రేజీ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి గిరీశ్ కోహ్లాీ దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

క్రేజీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు నేడు (ఏప్రిల్ 12) వచ్చింది. ప్రస్తుతం రెంటల్ పద్ధతిలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, ఈ చిత్రం ఏప్రిల్ 25న రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో అప్పుడు రెంట్ లేకుండా ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లంతా చూడొచ్చు. ఇప్పుడు చూడాలంటే రెంట్ చెల్లించాలి.

క్రేజీ సినిమా ఓ రాత్రి జరిగే ఘటనల చుట్టూ సాగుతుంది. ఈ...