భారతదేశం, ఏప్రిల్ 29 -- Theatre releases this week: ఏప్రిల్ చివరి వారంలో థియేటర్లలో కొత్త సినిమాల సందడి పెద్దగా కనిపించలేదు. కొన్ని చిత్రాలు వాయిదాలు పడ్డాయి. అయితే, ఈ వారం (మే తొలివారం)లో తెలుగులో ఐదు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఒకదానితో పోలిస్తే ఒకటి డిఫరెంట్ జానర్లతో ఈ చిత్రాలు అడుగుపెడుతున్నాయి. కామెడీ, థ్రిల్లర్, ఎమోషనల్, హారర్ కామెడీ ఇలా డిఫరెంట్ చిత్రాలు వస్తున్నాయి. ఈ మే తొలి వారం తెలుగులో థియేటర్లలో రిలీజ్ కానున్న 5 సినిమాలు ఏవంటే..

కమెడియన్ నుంచి హీరోగా మారిన సుహాస్ ఫుల్ ఫామ్‍లో ఉన్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన 'ప్రసన్న వదనం' సినిమా మే 3వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మనుషుల ముఖాలను మాత్రమే చూడలేని ఫేస్ బ్లైండ్‍నెస్ అనే డిఫెరెంట్ అంశంతో ఈ థ్రిల్లర్ మూవీ వస్తోంది. అరుణ్ వైకే ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. మణికంఠ జేఎస్, ప్రస...