భారతదేశం, మార్చి 2 -- నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంపై ఓ రేంజ్‍లో హైప్ ఉంది. ఈ మూవీ మరింత ఇంటెన్స్ యాక్షన్‍తో భారీ స్కేల్‍లో ఉండనుంది. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. నాని - శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా బంపర్ హిట్ అయింది. ఈ ఇద్దరు మరోసారి యాక్షన్ సినిమా కోసం జతకట్టడంతో ఆసక్తి అధికంగా ఉంది. అందులోనూ ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు చాలా ఆసక్తిని పెంచేశాయి. ది ప్యారడైజ్ మూవీ గ్లింప్స్ రిలీజ్‍కు టైమ్‍ను నేడు (మార్చి 2) మూవీ టీమ్ వెల్లడించింది.

ది ప్యారడైజ్ సినిమా గ్లింప్స్ రేపు (మార్చి 3) ఉదయం 11 గంటల 17 నిమిషాలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మార్చి 2) వెల్లడించింది. గ్లింప్స్ రిలీజ్‍కు డేట్‍ను ఇటీవలే ప్రకటించగా.. నేడు టైమ్‍ను ఫిక్స్ చేసింది. ఈ గ్లింప్ల్ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ వ...