భారతదేశం, ఫిబ్రవరి 7 -- నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. లవ్ స్టోరీ సినిమాలో ఇద్దరి మధ్య మంచి కెమెస్ట్రీ వర్కౌట్ అవగా.. మరోసారి వీరి కాంబో ఈ చిత్రంతో రిపీట్ అయింది. రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందిన తండేల్‍లో చిత్రంలో వీరి జోడీ ఎలా ఉంటుందోనని ముందు నుంచి క్యూరియాసిటీ ఉంది. ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (ఫిబ్రవరి 7) థియేటర్లలోకి వచ్చింది. అనుకున్నట్టుగానే చైతూ, సాయిపల్లవి జోడీ మరోసారి మ్యాజిక్ చేసింది. అయితే, ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జోరుగా ఓ చర్చ జరుగుతోంది.

సాధారణంగా ఏ సినిమాలో అయినా సాయిపల్లవి ఉంటే ఆమెనే హైలైట్ అవుతారు. హీరో ఎవరైనా సరే ఆమెపైనే ప్రేక్షకుల దృష్టి ఉంటుంది. ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్, సహజమైన అందం, స్వాగ్ ఇందుకు ముఖ్యమైన కారణాలు ఉంటాయి. అమరన్ లాంటి చిత్రంల...