భారతదేశం, ఫిబ్రవరి 15 -- తండేల్ సినిమా కలెక్షన్లలో దూకుడు చూపిస్తోంది. యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి అంచనాలతో వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కాగా.. మొదటి నుంచి మంచి వసూళ్లను రాబడుతోంది. బాక్సాఫీస్ వద్ద జోరు కనబరుస్తోంది. దీంతో తండేల్ మూవీ ఓ మేజర్ మైల్‍స్టోన్‍కు చేరువైంది.

తండేల్ సినిమా 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.95.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (ఫిబ్రవరి 15) అధికారికంగా వెల్లడించింది. ఈ లెక్కలతో ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది. వాలెంటైన్ వీక్‍లో తండేల్ అదరగొట్టిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తండేల్ సినిమా రూ.100కోట్లకు అత్యంత చేరువలోకి వచ్చేసింది. సుమారు మరో రూ.5కోట్లు సాధిస్...