భారతదేశం, ఫిబ్రవరి 9 -- తండేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఫిబ్రవరి 7న రిలీజైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్ అందుకుంది. రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించారు. తండేల్ సక్సెస్ దిశగా సాగుతుండటంతో థియేటర్ టూర్‌ను మూవీ టీమ్ మొదలుపెట్టింది. విజయవాడలోని ఓ థియేటర్‌కు నేడు (ఫిబ్రవరి 9) తండేల్ టీమ్ వెళ్లింది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు అక్కినేని అభిమానుల్లో జోష్ పెంచే కామెంట్లు చేశారు.

తండేల్ హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందూ, నిర్మాత బన్నీవాసు సహా మరికొందరు నేడు విజయవాడ వెళ్లారు. ముందు కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని శైలజ థియేటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా బన్నీవాసు అక్కినేని అభిమాను...