భారతదేశం, ఫిబ్రవరి 19 -- డాకు మహరాజ్ చిత్రంలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‍లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆ మూవీకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులకు వచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఊపేసింది. బాలయ్యకు మరోసారి అదిరిపోయే బీజీఎంలతో థమన్ అదరగొట్టారు. దీంతో డాకు మహరాజ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ (ఓఎస్‍టీ).. ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. థమన్ ఇప్పటికే అప్‍డేట్ ఇచ్చినా.. ఇంకా ఓఎస్‍టీని తీసుకురాలేదు. ఆ వివరాలు ఇవే..

డాకు మహరాజ్ సినిమా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍లతో కూడిన ఓఎస్‍టీ వచ్చేస్తోందంటూ ఇప్పటికే థమన్ హింట్స్ ఇచ్చారు. ఫిబ్రవరి 13వ తేదీన ఓఎస్‍టీని తీసుకొస్తామంటూ ట్వీట్‍తో చెప్పారు. అయితే, అలా జరగలేదు. 27 బీజీఎం ట్రాక్‍లతో పాటు పాటు మరో స్పెషల్ సాంగ్ కూడా ఈ ఓఎస్‍టీలో ఉంటుందని...