భారతదేశం, ఏప్రిల్ 16 -- తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రధాన పాత్ర పోషించిన 'నన్‍బన్' సినిమా 2012 జనవరిలో విడుదలైంది. జీవా, శ్రీకాంత్, ఇలియానా కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన రోల్స్ చేశారు. బాలీవుడ్ మూవీ '3 ఇడియట్స్'కు రీమేక్‍గా ఇది రూపొందింది. ఈ నన్‍బన్ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. అయితే, ఈ రీమేక్‍ మూవీ అనుకున్న రేంజ్‍లో హిట్ కాలేదు. కాగా, ఈ చిత్రం ఇన్నేళ్లకు ఇప్పుడు రెండో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

నన్‍బన్ సినిమా ఇప్పుడు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీ చాలా ఏళ్ల క్రితమే జియోహాట్‍స్టార్ (డిస్నీ+ హాట్‍స్టార్) ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన 13 ఏళ్ల తర్వాత ఇలా మరో ప్లాట్‍ఫామ్‍లోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.

నన్‍బన్ సినిమా ఇంజినీరింగ్ కాల...