భారతదేశం, జనవరి 22 -- ఇటీవల టీజీఎస్ఆర్టీసీ పలు పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ ఇటీవలనే పూర్తి కాగా. అధికారులు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. పరీక్ష తేదీని ప్రకటించారు.

ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ(ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 10 గంటలకు ఉంటుంది. ఇక మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహిస్తార...