భారతదేశం, జనవరి 15 -- తెలంగాణ సెట్ - 2025 పరీక్ష తేదీలపై మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే పరీక్షలు పూర్తి అయిన నేపథ్యంలో. వాటికి సంబంధించిన ప్రాథమిక కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు.. ప్రిలిమినరీ కీలను చూసుకోవచ్చు.

గతేడాది డిసెంబర్ నెలలోని 22, 23, 24 తేదీల్లో టీజీ సెట్ - 2025 ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా. ప్రాథమిక కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే టీజీ సెట్ ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీఎస్ సెట్ ఫలితాలతో పాటు ఇతర అప్డేట్స్ కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూ...