భారతదేశం, ఫిబ్రవరి 4 -- రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ -2026 ఎంట్రెన్స్ పరీక్షపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే షెడ్యూల్ విడుదలకాగా.. తాజాగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. టెన్త్ పాస్ అయిన వారితో పాటు ప్రస్తుతం పరీక్షలు రాసే విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు.

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సులకు గతేడాది ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్‌ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు.

అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి. జనరల్ విద్యార్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అయితే రూ. 250గా నిర్ణయించారు. గడువు దాటితే...