భారతదేశం, జనవరి 31 -- రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఈసారి మే 13వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు. టెన్త్ పాస్ అయిన వారితో పాటు ప్రస్తుతం పరీక్షలు రాసే విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు.

టీజీ పాలిసెట్ - 2026 నోటిఫికేషన్ ఈ వారం రోజుల్లోపు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యా మండలి కసరత్తు చేస్తోంది. గతేడాది ఈ పరీక్ష కోసం లక్ష మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా. ఈసారి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సులకు గతేడాది ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్‌ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థు...