భారతదేశం, ఫిబ్రవరి 4 -- రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. అన్ని ప్రధాన పార్టీల్లోనూ రెబల్స్ సమస్య కనిపించింది. అతికష్టమ్మీద చాలామందిని ఉపసంహరించుకునేలా చేసినప్పటికీ.. కొంత మంది మాత్రం వెనక్కి తగ్గకుండానే బరిలో నిలిచారు. పలుచోట్ల నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మంగళవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణల గడువు పూర్తికాగా. 2,996 వార్డులకుగానూ 12,993 మంది పోటీలో నిలిచారు. 6,701 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో 2,996 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. చాలాచోట్ల రసవత్తరమైన పోటీ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. కుర్చీని కైవసం చేసుకోవాలనే దిశగా అడు...