భారతదేశం, జనవరి 15 -- మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. మార్గదర్శకాలను కూడా ప్రకటిస్తూ.ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే రాజ్యాంగ మార్గదర్శకాలకు లోబడే రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున ఖరారయ్యాయి. ఇక ఆన్ రిజర్వుడ్ కోటాలో మహిళకు 4, జనరల్ కు ఒక స్థానం ఖరారైంది. ఇక బీసీలకు మూడు (జనరల్‌ 2, మహిళలకు 1) కేటాయించారు.

మరోవైపు రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్లను k కూడా ఖరారు చేశారు. ఎస్సీలకు 17 (జనరల్‌-9, మహిళలు-8), ఎస్టీలకు ఐదు సీట్లు (జనరల్‌-3, మహిళలు-2)...