భారతదేశం, ఫిబ్రవరి 17 -- తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఓవైపు పరీక్షల కోసం సమయం కూడా దగ్గరపడుతోంది. ఇప్పటికే సెంటర్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి.

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు ఇవాళ లేదా రేపు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన నమూనా హాల్ టికెట్లను(ప్రివ్యూ) కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఏమైనా తప్పులు దొర్లితే సవరించుకునే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించారు. పలువురు విద్యార్థులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు.

ఇక తుది హాల్ టికెట్లను ముందుగా ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. కాలేజీల లాగిన్ లో కూడా ఉంటాయి. ఆ తర్వాత. విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్ కు స...