భారతదేశం, ఫిబ్రవరి 1 -- రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఇందుకోసం ఇంటర్మీడియట్ బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కోసం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు సుమారు 3.40 లక్షల మంది హాజరవుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,440 కేంద్రాలను ఏర్పాటు చేయగా. ఆయా కేంద్రాల్లో 6 నుంచి 8 సీసీ కెమెరాల చొప్పున ఏర్పాటు చేశారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించేలా అనుసంధానం చేశారు.

ఎంపీసీ విద్యార్థులు 2,74,007 మంది, బైపీసీ విద్యార్థులు 1,33,415 మంది ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ఇక ఒకేషనల్‌ విద్యార్థులు మరో 1,18,770 మంది ఈ పరీక్షలు రాస్తారు. రా...