భారతదేశం, జనవరి 15 -- తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన నమూనా హాల్ టికెట్లను(ప్రివ్యూ) కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫలితంగా ఏమైనా తప్పులు దొర్లితే సవరించుకునే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించింది.

ఇక ఈ 15 రోజులలోపే విద్యార్థులకు సంబంధించిన తుది హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాక్టికల్ సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే కాలేజీలకు చేరాయి. ఆన్ లైన్ లోనూ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచేలా సాఫ్ట్ వేర్ ను కూడా సిద్ధం చేశారు. మొత్తంగా చూస్తే ఈ నెలాఖారులోపు ఇంటర్ హాల్ టికెట్లు విద్యార్థులకు అందే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 2వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేద...