భారతదేశం, ఫిబ్రవరి 5 -- ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 34 పోస్టులన భర్తీ చేస్తారు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను మే ,2026లో నిర్వహిస్తారు. హాల్ టికెట్ల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు. మొత్తం 34 పోస్టులుండగా.. ఓపెన్ కేటగిరిలో 11 ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి నుంచి పదో తరగతి మధ్య ఉత్తీర్ణులై ఉండాలి.2026 జులై 1వ తేదీ నాటికి 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 45 మార్కులకు రాత పరీక్షతో పాటు 5 మార్కులకు వైవా ఇంట...