భారతదేశం, జనవరి 30 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

ఫిబ్రవరి 14న టీజీ ఈఏపీసెట్ - 2026 నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఇక పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి. అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను ...